Author: admin

యూ ట్యూబ్ నుండి వీడియోలు ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి ?

నేటి తరం ఉపాధ్యాయులు మారుతూ ఉన్నారు. కొత్త విషయాలు, టెక్నాలజీ నేర్చుకుంటున్నారు. చాలా పాఠశాలలో TV లు కనబడుతున్నాయి. ఉన్నత పాఠశాలలో K-YAN లు ఉన్నాయి. చాలా మంది ఉపాధ్యాయులు వాటిని చక్కగా వాడుకుంటున్నారు. కొంత మంది ఉపాధ్యాయులు సొంతంగా రికార్డు చేసి వీడియోలు కూడా తయారు చేసుకుంటున్నారు. వాటిని యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేస్తున్నారు. వాటిని మనం డౌన్ లోడ్ చేసుకుని వాడుకోవచ్చు. ఈ వీడియోలు మన బోధనఅభ్యసన ప్రక్రియను ఆకర్షణీయంగా ఆహ్లాదకరంగా […]

చేతి నిండా చాక్ పీస్ పొడి పూసుకుంటున్నారా?

టీచర్ గా పని చేస్తుంటే చాక్ పీస్ పొడి అంటడం సహజం. దానికి మళ్ళీ పూసుకుంటున్నారా ? అని అడగడం దేనికి ? అని చాలా మందికి అనిపించి ఉండవచ్చు. కానీ చాలా మంది టీచర్లు ఈ చాక్ పీస్ పొడి వల్ల చాలా రకాలు గా ఇబ్బంది పడిన వాళ్ళను చూశాను. చేతికి చాక్ పీస్ పొడి అంటుకోవడం , మధ్యలో చెమట తుడుచుకోవడం కోసం కర్చీఫ్ తీసినపుడు దుస్తులకు అంటుకుంటుంది. ఇంకా మనకు తెలియకుండానే […]

గేయం చార్టు లు ఎలా తయారు చేసుకోవాలి ?

భాషా బోధన లో బోధనభ్యసన సామాగ్రి కి ఉన్న ప్రాముఖ్యత గురించి మనం ఇదివరకే తెలుసుకున్నాము. ఈ రోజు మనం గేయం చార్టు ఎలా తయారు చేసుకోవాలి? వాటిని ఎలా ఉపయోగించాలి అనీ అంశం చూద్దాం. గేయం చార్టు ఎందుకు తయారు చేసుకోవాలి ? పాఠ్య పుస్తకం లో ఉన్న గేయం చిత్రం చిన్నదిగా ఉంటుంది కదా. విద్యార్థులందరికీ కనబడేలా మనం ఒక డ్రాయింగ్ షీట్ తీసుకుని దానిపై పెద్ద అక్షరాలతో చార్టు రాస్తాము. అలా రాయడం […]

ఆలెక్సా రెండు నెయ్యి దోశలు ప్రింట్ చేయి

మీరు చదివింది కరెక్టే . దోశల ప్రింటర్ వచ్చేసింది. చపాతీలు తయారు చేసే యంత్రం ఎక్కువ వంటగదులలోకి దూరక ముందే మరో విచిత్ర యంత్రం తయారు అయింది. ఉరుకుల పరుగుల జీవితం లో చపాతీలు దోశలు తయారు చేయాలంటే ఎంత సమయం, ఎంత ఓపిక ఉండాలో చేసే వారికే తెలుస్తుంది.అలాంటి వారి సమయాన్ని శ్రమ ను ఆదా చేసేందుకు వచ్చేసింది. దోశ లు ప్రింట్ చేసే యంత్రం.. Evo chef వారు తయారు చేసిన ఈ యంత్రం […]

తెలుగు ఫ్లాష్ కార్డ్స్ తయారీ

ఫ్లాష్ కార్డ్స్ : ఇవి భాషా బోధన లో చాలా చక్కగా పనిచేస్తాయి. పాఠ్య పుస్తకం, నల్ల బల్ల కాకుండా వేరే ఏ వస్తువు ఇచ్చినా పిల్లవాడు ఆసక్తి తో చూస్తూ ఉంటాడు. అది బోధనఅభ్యసన సామాగ్రి (Teaching Learning Material )మహిమ. ఇంటివద్ద రకరకాల డిజిటల్ పరికరాలకు వినోద ప్రక్రియలకు అలవాటు పడిన నేటి తరం పిల్లలు నల్ల బల్ల పై తెల్ల సుద్దముక్క తో అక్షరాలు రాస్తుంటే వాటి వైపు చూడమని ఎంత బతిమలాడినా […]

గద్దర్ పాటల్లో వాడి తగ్గిందా ?

ప్రజా యుద్ధ నౌక గా పేరు గాంచిన ప్రజాకవి గద్దర్ రచన మరియు గానం తో ఇటీవల విడుదల చేసిన పాట వింటే / చూస్తే సగటు గద్దర్ అభిమానులకు ఈ అనుమానం వచ్చి ఉంటుంది. ఒకప్పటి గద్దర్ వేరు ఇప్పటి గద్దర్ వేరు అని చాలా మంది అనుకుంటున్నారు. దానికి కారణాలు లేకపోలేవు. గద్దర్ ప్రజా సమస్యలపై రాసిన ఎన్నో పాటలు ఇప్పటికీ ప్రజలను ఉద్యమం వైపు ఉసిగొల్పుతాయి అనడం అతిశయోక్తి కాదు. బండెనక బండి […]

మైసూరు ముచ్చట్లు -3

ఇక్కడ చేపలు మరమరాలు తింటున్నాయి వేకువజామునే శ్రీ రంగనాథ స్వామి ఆలయం దర్శనం అనంతరం మరలా మా మైసూరు చైతన్య రథం బయలుదేరినది. ఇక్కడ నుండి దాదాపు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రివేణి సంగమం వద్దకు మా ప్రయాణం మొదలైంది. పేరు త్రివేణి సంగమం అని తెలుసు కానీ అక్కడ ఏ ఏ నదులు కలుస్తాయి అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు మా నాయకులు వారు తీసుకెళ్తున్నారు మేము వెళుతున్నాము అంతే. తెలుసుకోవాలన్న ఆసక్తి […]

మైసూరు ముచ్చట్లు – 2

మైసూరు బృందావన్ గార్డెన్స్ చూసిన అనుభూతి ఇంకా మరువక ముందే పొద్దుగాల లేచి శ్రీరంగ పట్నం రంగనాథ స్వామి దేవాలయానికి పోతున్నాము. త్వరగా నిద్రపోండి త్వరగా లేవండి అని ఆదేశించారు మా నాయకుల వారు. సరే అనుకుని కార్యశాల విషయాలు ఒకసారి పున:శ్చరణ చేసుకుని మాకు కేటాయించిన వసతి గృహం లోని గది లో నిద్ర కు ఉపక్రమించాము. ఉదయం వేకువ జామునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని మైసూరు నుండి 18 కి. మీ ల దూరం […]

మైసూరు ముచ్చట్లు- 1

మండు వేసవి నుండి చిరు జల్లుల తొలకరికి ప్రకృతి మారే వేళ , నా బడి పిల్లల కిలకిలలు, కేరింతలు, గుసగుసలు, రుసరుసలు వంటి వాటికి అన్నిటికీ దూరంగా, తొలి సారి రాష్ట్రం బయట పలు రాష్ట్రాల ఉపాధ్యాయుల తో కలిసి పని చేసేటందుకు మొదలైంది నా పయనం. రైలు ప్రయాణం కొత్త కానప్పటికీ, తోటి ఉపాధ్యాయులు, పాఠ్య పుస్తక రచయితలు, స్టేట్ రిసోర్స్ గ్రూప్ మెంబర్స్ కావడం తో ఒకింత బెరుకుగా నే ఉంది. కానీ […]

విద్యార్థుల దృష్టి ఎలా ఆకర్షించాలి ?

                                             ఆండ్రాయిడ్ డివైజ్ లేనిదే అన్నం కూడా తినని స్టేజ్ కి ఇవాళ రేపు పిల్లలు తయారయ్యారు. 2 నుండి 5 సంవత్సరాల పిల్లలు వివిధ రకాల కార్టూన్ ఛానెల్స్ కి , యూ ట్యూబ్ ఛానెల్స్ కి కార్టూన్ వీడియోలకు, కథలకు, అనేక రకాల ఆప్ లకు అలవాటు పడ్డారు. ఆండ్రాయిడ్ ఫోన్ లో మనకు తెలియని అనేక ఆప్షన్స్ పిల్లలకు తెలుస్తున్నాయి.                                                        ఇటువంటి పిల్లల ఆసక్తి ని నల్ల బల్ల పై తెల్లటి […]