ఏరు ముందా ఏకాశి ముందా ?

మన పెద్దోళ్లు ఊకె గీ ముచ్చట జెప్తాంటే ఏంటిదో అనుకునేటోడిని. ఇయ్యాల సమజ్ ఐంది. ప్రతి ఏడూ తొల్సూరి /తొలకరి సినుకులు పడేటపుడు ఎండాకాలం పోయి వానాకాలం వచ్చే కొత్తల మొదటి సారి ఏట్లెకు నీళ్ళు వస్తే ఏరు సాగుతాంది అంటరు. గదే యాల్లకు పేలాల పిండి పండుగ , సత్తు పిండి పండుగ అని పోరాగాండ్లు ముద్దుగా పిలుచుకునే తొలి ఏకాదశి పండుగ వస్తది. ఈ రెండూ ఒకదానికొకటి పోటీ పడుతూ నువ్వు ముందా నేను ముందా అని జగడమాడతాయి. దాగుడుమూతలు ఆడతాయి. ఒక్కోపాలి రెండూ వెనకపట్లు పడతాయి.

మనందరికీ బువ్వ పెట్టే రైతన్న మాత్రం ఏరే ముందు రావాలి అనుకుంటాడు. ఇలా వాతావరణం మారే సమయం లో తొలి ఏకాదశి పండుగ కన్నా ముందు వానలు పడితే ఏరు ముందు వస్తది. వానలు ఎనకబడితే ( ఆలస్యం అయితే ) ఏకాశి ముందు వస్తది. ఇలా రెండూ పోటీబడుడు, ఏరు సాగంగనే రైతు సంబరపడుడు మనం ఎనకటి నుంచి సూస్తున్నదే. ఖమ్మం నగరం లో ఉన్న జనాలకు ఇయ్యాల ఏరు వచ్చింది, ఎల్లుండి ఐతారం(ఆదివారం ) నాడు ఏకాశి (తొలి ఏకాదశి ) పండుగ వస్తుంది . అంటే ఈ సారి మన ఖమ్మం వాసులకు ఏరే ముందొచ్చింది కదా !

గిప్పుడు సమజ్ అయిందా ? ఏరు ముందా ఏకాశి ముందా అన్న సామెత పూర్తి మతలబు ? ఇంకెందుకు జాము ? ఖమ్మం ను ఆనుకుని ఉన్న మున్నేరు నదిల నీళ్ళ గలగల ఎట్లున్నదో ఓ పాలి (ఒకసారి ) జూసొద్దాం పారి.

అందరు జూసినారుల్లా ?

తెలంగాణా యాస ల పూర్తిగా టైప్ చేసుడు కొంచెం కష్టంగానే అనిపించింది కానీ ఇది రాయడం నాకు ఇష్టం.. మీకు సులభంగా అర్థం కావడం కోసం అక్కడక్కడా అర్థాలు బ్రాకెట్ లో రాసిన. కానీ అవి ఉండాలనా వద్దా అనేది మీరు కామెంట్ ల చెప్పుర్రి .. ఇక నుండి రాసేటపుడు జర దిమాక్ ఎక్కువ బెట్టి రాస్తా ..

ఇట్లు

మీ

పోతరాజు

            నా లొల్లి అనే పేరుతో ఈ పేజీలో అనేక అంశాలను నాకోణం లో వివిరించి మీ ముందుకు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. మీ అభిప్రాయాలను కోరుతున్నాను . 

Will Spoken English of Teachers Help English Medium Success ?

Government recently introduced English Medium in all management schools in Telangana. With the help of Azeem Premji University, English Language Enrichment Course was introduced and made it mandatory to all teachers. All the teachers have to get certified that they are enriched in English.

This course focused on Spoken English Only. It reduced some stage fear and removed inhibitions among teachers towards speaking English. Many teachers still depend on others to complete the tasks. Little bit technical knowledge also required to complete these tasks on website and in app. Some teachers are trying very hard to get their English language skills enriched. they will succeed also.

But “will the improvement of spoken English skills of teachers help students in understanding English or learning English medium subject? ” is a question now.

Students studied in Telugu medium so far. In the subjects like Environmental science, they have to learn so much of vocabulary. Students will feel unfamiliar to those words. Especially in higher sections social studies, biological science need special focus to increase the terminology .

Simply Speaking in English Will not help them.

What Teachers have to do now ?

Teachers have create the environment of English in their classrooms. They have to create similar situations which they have faced in ELEC training face to face and online sessions. They have to show some pictures, videos, and ask children to response on that pictures and videos.

Teachers have to enrich their terminology in subjects like social studies and biological science, Mathematics and make the student familiar to the terminology.

  If teacher creates space for students to expose to the English Language, then only this program will be succeed. Just speaking of teacher in English is not sufficient.  

So my sincere request to all my friends and colleagues is that please observe all the tasks which we are supposed to do in our training program. Observe how the have been designed. We have to design similar type of activities to our students in our class rooms, provide material either hard copies or softcopies, pictures or videos, movies rhymes etc.. We have to keep in mind that according to their class and previous knowledge only we have to design the activities.

There are so many hurdles in our way to reach the goal. But with our dedication and commitment we can do miracles. This will not happen in overnight. We have to keep on working, be positive, get inspired, acquire new skills, knowledge, Keep on learning this will help you in your future.

    As one more new academic year(2022-23) is going to start in few days, we have to be prepared and get ready with plan to implement ELEC learning points in our classrooms (ENGLISH MEDIUM CLASSROOMS)

thank you

yours

Digi Guru Praveen.